నిస్వార్ధంగా ప్రజాసేవ చేస్తా సుజనా చౌదరి
కేఎల్ రావు నగర్ లొ శ్రీరామ నామ సీతారామ శివ సాయి మందిరం లో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త బాయన హేరంభ కుమార్ హేమలత దంపతులు సుజనా చౌదరి సతీమణి పద్మజ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. సుజనా దంపతులు స్వామి వారి కళ్యాణం లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రజల అభిష్టం మేరకే పరిపాలన ఉండాలని లౌకికవాద సౌమ్యవాద ప్రగతిశీల పరిపాలనే దేశానికి రాష్ట్రానికి శ్రేయస్కరం అన్నారు. అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట తరువాత జరుపుకుంటున్న శ్రీరామనవమి ప్రత్యేకమైనదని రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్ధుల్ని శత్రువులుగా చూసే పరిస్థితి పోవాలని నేటి పాలకులు రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నిస్వార్ధంగా ప్రజాసేవ చేయడానికె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల సహకారంతో కూటమి మద్దతుతో అఖండ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కళ్యాణ మహోత్సవంలో ఆలయ ధర్మకర్త హేరంభ కుమార్ దంపతులు ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరాం దంపతులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.














