అయిదేళ్ళు కాదు…జీవితాంతం పశ్చిమ కోసం పని చేస్తా
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కోసం జీవితాంతం పని చేస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోలేదని, తాను ఈ బాధ్యత తీసుకుని ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. తనకు మద్దతు ఇచ్చినవారందరికీ సుజనా కృతజ్ఞతలు తెలిపారు.






