నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీలేని పోరాటం-సుజనా చౌదరి
పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) గురువారం నామినేషన్ వేశారు. చిట్టినగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత చిట్టినగర్ కొత్త అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసారు . మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా చెన్నుపాటి శ్రీనివాస్ ఎమ్మెస్ బేగ్ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ జన సైనికులు అమ్మిశెట్టి వాసు రజిని, కూటమి అభ్యర్థి సుజనా కు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు. ప్రచార వాహనంలో సుజనా చౌదరి వంగవీటి రాధాకృష్ణ కేశినేని శివనాధ్ ప్రజలకు అభివాదం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని పశ్చిమ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే బెస్ట్ గా నిలుపుతానని సుజనా చౌదరి చెప్పారు. నియోజకవర్గ కొండ ప్రాంత ప్రజల కష్టసుఖాలు దగ్గరనుంచి చూశానని వారి సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలల్లో నియోజకవర్గ అభివృద్ధి ని విస్మరించారన్నారు. కుల మతాలకు అతీతంగా సమర్థ లక్షణాలున్న నాయకుడిని ఎన్నుకోవాలని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాజీలేని పోరాటం చేస్తానన్నారు. కేంద్రంలో ఎన్డీయే హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఎన్డీఏ కూటమిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్నారు.డబల్ ఇంజన్ సర్కార్ తో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఓటేయాలని సూచించారు. మాటల మనిషిని కాదని చేతల్లో చేసి చూపిస్తానని పశ్చిమ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
చంద్రబాబుకి కానుకగా ఇస్తా-కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ విజయవాడ ఎంపీ స్థానంలోనూ దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని ఈ సీట్లను గెలిచి చంద్రబాబుకి కానుక ఇస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.