హుందాతనం… ఆత్మీయ పలకరింపులు
అలవోకగా కొండలపై మెట్లెక్కుతూ
సమస్యల పరిష్కారానికి ఇప్పటి నుంచే కార్యాచరణ
పశ్చిమలో సుజనా ప్రచార జోరు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) తన ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా కొనసాగిస్తున్నారు. ఎక్క డో ఢిల్లీలో ఉండే సుజనా సామాన్య ప్రజలను సరైన రీతిలో పలకరించగలరా..అనే ప్రచారానికి భిన్నంగా సుజనా ప్రచారం సాగుతోంది. పేద వర్గాల ప్రజలతో ఆయన పలకరింపులు ఆత్మీయంగా ఉంటున్నాయి. ప్రత్యర్థుల ప్రచారాన్ని గమనించిన ప్రజలకు సుజనా వ్యవహరిస్తున్న ప్రచార శైలిని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ఉండే అనుమానాలు అన్నీ సుజనా వ్యవహారశైలితో పటాపంచలయ్యాయి.
తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తాను ఎపుడు ఇలాగే ఉంటానని సుజనా ప్రజలతో చెబుతున్నారు. కొందరు రాజకీయ నాయకుల ప్రసంగాల తీరుకు భిన్నంగా ఆయన ప్రసంగాలు హుందాగా ఉంటున్నాయి. ప్రత్యర్ధులను కించపరిచేలా సుజనా మాట్లాడడం లేదు. పరుష పదజాలాన్ని ఉపయోగించడం లేదు. తాను ప్రజలకు ఏం చేయబోయేది స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు అది కూడా సమస్యను ఆకళింపు చేసుకున్న తర్వాతనే తన నిర్ణయాన్ని చెబుతున్నారు. నియోజక వర్గంలో కొండ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా నివాసాలు ఉంటున్నందున కొండల శిఖర ప్రదేశాల్లో ఉంటున్న ప్రజలతో కూడా ఆత్మీయంగా పలకరింపులు చేస్తున్నారు. ఇన్ని ఎన్నికలు జరిగినా ఇలా కొండ చివరి వరకు వచ్చిన నాయకుడు సుజనా మాత్రమేనని స్థానికులు అంటున్నారు. మొత్తంగా ప్రజల ఆదరణతో సుజనా విజయం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయని కూటమి శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి.