నగరాల సంక్షేమానికి పెద్దపీట
ఐక్యంగా కలిసి రండి
_ సుజనా చౌదరి
నగరాల సంక్షేమం కోసం వారి ఉన్నతి కోసం ప్రత్యేకంగా పాటుపడతానని సుజనా చౌదరి అన్నారు. నగరాల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మిల్క్ ప్రాజెక్ట్ కన్వెన్షన్ హాల్లోఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని అధిక సంఖ్యలో ఉన్న నగరాల సామాజిక వర్గీయులను అగ్ర స్థానంలో నిలబెడతానని ఆర్థికంగా విద్యాపరంగా ఉన్నత స్థానానికి తీసుకురావాలన్న ఆశయంతో వారి సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా విద్య వైద్యం మౌలిక సదుపాయాల కల్పనె ధ్యేయంగా కృషి చేస్తానన్నారు. నగరాల సంక్షేమం కోసం వైసీపీ నాయకులు ఏం చేశారో ఏం చేయబోతున్నారొ చెప్పాలన్నారు. ఎన్నికల ముందు బిసి లకు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి వైసిపి అధికారంలోకి వచ్చిందని ప్రస్తుత ఎమ్మెల్యే ఐదేళ్ల పాలనలో నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి ప్రత్యేకంగా చట్టసభల్లో నగరాలకు ప్రాధాన్యత కల్పిస్తామని అందరూ ఐక్యంగా కలిసి ఎన్డీయే కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గానికి రావడం మనందరి అదృష్టంగా భావించాలని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగల సత్తా సుజనా కి ఉందని నియోజవర్గ అభివృద్ధి కోసం ఆయన కట్టుబడి ఉన్నారన్నారు.నగరాల సంఘం నాయకులు పైలా సొమినాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ నగరాల సంక్షేమాన్ని విస్మరించారని దామాషా ప్రకారం చట్టసభల్లో వారికి కేటాయించవలసిన పదవులు కూడా వారికి ఇవ్వలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో నగరాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అడ్డూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో నగరాలకు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలి అని విజ్ఞప్తి చేశారు.
పైలా సతీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న నగరాల వాణి వినిపించేందుకు చట్టసభల్లో స్థానం కల్పించాలని గత పాలకులు నగరాల సంక్షేమానికి అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదన్నారు.కూటమి అధికారంలోకి వచ్చాక వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నగర సంగం నాయకులు కొర గంజి భాస్కరరావు బాయన శేఖర్ బాబు నాగోతీ వెంకటేశ్వరరావు మాజీ కార్పొరేటర్ బంకా నాగమణి నగరాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.