ఏపీలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో కలిసి 75 కిలోల భారీ కేక్ ను సుజనా చౌదరి కట్ చేశారు. ఏపీలో అరాచక పాలన పోయి రామరాజ్యం రావాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి ఏపీ ప్రజలను మోసం చేశారని, అమరావతి అభివృద్ధి, ఏపీ ప్రయోజనాలు, శాంతి భద్రతలు ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని సుజనా చౌదరి అన్నారు. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని తెలిపారు. చంద్రబాబుకు ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని ధిమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్. టీడీపీ ఏపీ కార్య నిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బేగ్, టీడీపీ మీడియా ఇన్ చార్జ్- మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, అమ్మిశెట్టి వాసు, జనసేన ఆంధ్ర జొన్ కన్వీనర్ బాడిత శంకర్, జనసేన నాయకురాలు రజిని, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


