జగన్,వెలంపల్లి అవినీతి మహేష్ కే ఎక్కువ తెలుసు
పవన్ ని విమర్శించే అర్హత మహేష్ కు లేదు
పవన్ పై పిచ్చి ప్రేలాపనలు పేలితే ఇంటిని ముట్ట డి స్తాం
మహేష్ కు అమ్మి శెట్టి వాసు హెచ్చరిక
జగన్ వెలంపల్లి అవినీతి గురించి పోతి న మహేష్ కే ఎక్కువ తెలుసని జన సేన సమన్వయ కర్త అమ్మి శెట్టి వాసు అన్నారు. గత ఐదేళ్లుగా వారిద్దరి అవినీతి గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో విషయాలు చెప్పిన మహేష్ కు వైసిపి లో చేరగానే వారిద్దరూ పునీతులు ఐపోయారా.. అని వాసు ప్రశ్నించారు. జన సేన వీర మహిళలు మల్లెపూడి విజయలక్ష్మి, తిరుపతి అనూష తో కలసి వాసు మీడియాతో ఆదివారం మాట్లాడారు. జగన్, వెలంపల్లి అవినీతి పై మహాష్ కు ఉన్నంత అవగాహన మరెవరికీ లేదన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం మహేష్ వైసిపికి పే టీమ్ బ్యాచ్ గా మారిపోయారని, అప్పటి వరకు అవినీతి పరులైన వారు ఆయన పార్టీ మారగానే దేవుళ్ళు ఐపొయారా అని వాసు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి,ఆస్తుల గురించి మహేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మరో సారి ఇదే విధంగా ఆయన వ్యవహరిస్తే మాత్రం జన సైనికులు మహేష్ ఇంటిని ముట్టడించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అంతే కాదు మహేష్ చేసిన అవినీతి. మోసా ల చిట్టాను కరపత్రాల రూపంలో ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. పశ్చిమ నియోజక వర్గాన్ని అభివృద్ధి పరచేందుకు బీజేపీ తరఫున రంగం లోకి దిగిన సుజనా చౌదరి గురించి మాట్లాడితే సహించబోమని, ఆయన గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందన్న విషయాన్ని నియోజక వర్గ ప్రజలు అంగీకరి స్తున్నారని వాసు అన్నారు. పార్టీలో ఉంటూనే వైసిపి కి మహేష్ కోవర్టుగా పనిచేశారని వాసు అన్నారు.
పవన్ పొత్తు ప్రకటన చేశాక టపాసులు కాల్చింది పోతిన కాదా అన్నారు.
మహేష్ కోసం చంద్రబాబు తన సీట్లు త్యాగం చేసింది గుర్తు లేదా అని వాళ్ల నాయకులను ఒప్పించింది నిజం కాదా అని వాసు ప్రశ్నించారు. పశ్చిమం లోని 22 డివిజన్ల జన సేన అధ్యక్షులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.





