సుజనా కే మా మద్దతు
తమ డిమాండ్స్ సాధన ఆయన ద్వారానే నమ్ముతున్నాం
వడ్డెర సంఘం నేతలు
తమ జాతి దీర్గకాలిక సమస్య అయిన వడ్డెర లను ఎస్. టి లుగా మార్చే అవకాశం పశ్చిమ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి ద్వారానే సాధ్యమవుతుందని పలువురు వడ్డెర సంఘం నేతలు అభిప్రాయపడ్డారుఆదివారం ఒక ప్రవేట్ ఫంక్షన్ హాలు లో జరిగిన వడ్డెర ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో వడ్డెర కులస్థులు ఎస్. టి లుగా పరిగణించబడుతున్నారని , జాతీయ పార్టీ ద్వారానే తమ సమస్య పరిష్కారం అవుతుందని నమ్ముతున్నామని అందులో భాగంగానే సుజనా చౌదరికి మద్దత్తు ఇస్తున్నాం అని అన్నారు. వడ్డెర నేతలు తులసీ రామ్,ఏ శ్రీనివాస్ రావ్, కనకా రావ్, నాగ రాజు తదితరులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఆపేసిన వడ్డెర కార్పొరేషన్ నిధులు తిరిగి పునరుద్ధరణ చేయాలని కోరారు. ప్రమాద బీమా సౌకర్యం పునరుద్ధరిచాలన్నారు. సబ్సిడీ మీద పనిముట్లు ఇవ్వాలన్నారు. ఇసుక లో రిజర్వేషన్ విధానం ప్రవేశ పెట్టాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గం లో కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశం లో వాగు సెంటర్, తదితర ప్రాంతాలోని వడ్డెర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సుజనా చౌదరి కే ఓటు వేసేలా తమ కులం నుండి తీర్మానం చేసుకుంటామని వడ్డెర నేతలు అన్నారు.సమావేసాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్ సమన్వయం చేశారు.
