జైనుల సమస్యలు పరిష్కరిస్తా – సుజనా చౌదరి

April 22, 2024

జైనుల సమస్యలు పరిష్కరిస్తా -సుజనా చౌదరి

జైన్ సమాజ్ ఆధ్వర్యంలో మహవీర్ మహా జన్మదిన జయంతి వేడుకలు వన్ టౌన్ గుజరాతి సమాజ్ బిల్డింగ్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా టిడిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు సోలంకి రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ భగవాన్ మహావీర్ చూపిన అహింస బాటలోనే జైనులంతా పయనించాలని అన్నారు. అహింసతోపాటు విద్య తోనే మంచి భవిష్యత్తు ఉంటుందనె నినాదాన్ని జైన సమాజం విస్తృతంగా ప్రచారం చేయడం అభినందనీయమని అన్నారు.సృష్టిలో నివసించే ఏ జీవిని హింసించకుండా హాని తలపెట్టకుండా జీవించాలని ఆ దిశగా సమాజాన్ని చైతన్య పరుస్తున్న జైన్ సమాజ్ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గంలోని జైనులందరికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నాలాల్ జైన్ ప్రవీణ్ ఉత్తమ్ చంద్ బండారి పియూష్ దేశాయ్ కొణిజేటి రమేష్ పలువురు జైనులు పాల్గొన్నారు.

https://sujanaforwest.com/wp-content/uploads/2024/04/sujana-chowdary-with-jains-01.webp

జ్యోతిని వెలిగిస్తున్న సుజనా చౌదరి

sujana-chowdary-with-jains-04
sujana-chowdary-with-jains-02
sujana-chowdary-with-jains-03

కార్యక్రమానికి హాజరైన జైన్ సమాజ్ ప్రతినిధులు

మీ
యలమంచిలి సత్యనారాయణ చౌదరి
(సుజనా చౌదరి)

బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి
విజయవాడ వెస్ట్ నియోజకవర్గం

మీ సమస్యను మాకు తెలియజేయడానికి ఈ బటన్ నొక్కండి.

https://sujanaforwest.com/wp-content/uploads/2024/04/sujana-chowdary-for-vijayawada-west-1-160x160.png
Sujana for Vijayawada West 2024
Contact
08645645645
Shri YS Chowdary, H No 7-590/1A, KCP Colony, Revenue Ward 13,Near Siddhartha College Back Side, Tadigadapa, Kanuru, Vijayawada - 520007