ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని సుజనా చౌదరి అన్నారు. ప్రచారంలో భాగంగా సోమవారం 53 వ డివిజన్ కొత్తపేట హనుమంతరాయ చేపల మార్కెట్ ను సుజనా సందర్శించారు. మార్కెట్ అసోసియేషన్ పెద్దలు సయ్యద్ సలీం అహ్మద్ సుజనాకు స్వాగతం పలికారు. చేపల మార్కెట్ లోని సమస్యలను పరిస్థితులను సుజనా అవగాహన చేసుకున్నారు. కూటమి అధికారంలోకి రాగానే హనుమంతరాయ మార్కెట్ అభివృద్ధి కోసం త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి యువతకు ఆర్థికంగా చేయూత అందిస్తామని తెలిపారు. వైసీపీ పాలనలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రత్యే కంగా ఎలాంటి పథకాలు అమలు చేయలేదన్నారు. ముస్లిం మైనారిటీలందరూ కూటమికి అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బేగ్ 53వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు రావుల సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఈగల సాంబ బీజేపీ,టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మార్కెట్లోని సమస్యలను తెలుసుకుంటున్న సుజనా చౌదరి
