ప్రచారంలో సుజనా తనయుడు కార్తీక్
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి-సుజనా చౌదరి తరఫున తనయుడు కార్తీక్ పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేసారు.తన తండ్రి గెలుపు పశ్చిమ నియోజక వర్గం అభివృద్ధికి మలుపు అని కార్తీక్ తన ప్రచారంలో పేర్కొన్నారు.
సోమవారం 46, 47వ డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి బీజేపీ అభ్యర్థి సుజనా ను గెలిపించాలని,సుజనా గెలుపు ద్వారా నియోజక వర్గ సమస్యలు సత్వరం పరిష్కారం అవుతాయని ప్రజలు పేర్కొన్న అంశాల కు సమాధానంగా కార్తీక్ తెలిపారు.
అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే తన తండ్రి సుజనాతోనే సాధ్యమని, ఆయనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కార్తీక్ అభ్యర్థించారు.
కొండ ప్రాంతాల ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయించాలని, గత ప్రభుత్వం కరపత్రాల రూపంలో పట్టాలు ఇచ్చిందని, అవి నిరుపయోగంగా మారాయని కార్తీక్ తో కొందరు మహిళలు మొర పెట్టుకున్నారు. గండమాల అచ్చమ్మ వీధి, యలవ ర్తి వీధి, కాశీ పతి వీధి, కలరా ఆసుపత్రి ప్రాంతాలతో పాటు కే ఎల్ రావు నగర్ వరకు కార్తీక్ ప్రచారం చేశారు. స్థానిక సమస్యలైన విద్యుత్ చార్జీల భారం, పెన్షన్ల తొలగింపు, జక్కంపూడి లోని టిడ్కో ఇళ్ల మంజూరు వంటి పరిష్కారాలు తన తండ్రి సుజనాతోనే సాధ్యమని కార్తీక్ తెలిపారు.. ఈ పర్యటనలో నాగోతి రామారావు, పోతినీడి లోకేష్, కట్టా సాంబయ్య, కోటేశ్వర రావు, పైలా నరసింహారావు తదితరులు కూడా పాల్గొన్నారు.