ఓల్డ్ ఆర్ ఆర్ పేటలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, గత పాలకులు ఈ సమస్యపై దృష్టి సారించలేదు అని పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) సోదరి ధనలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇదే సమస్యపై తమ వద్ద వాపోయారని ఆమె అన్నారు. , 56వ డివిజన్ ఓల్డ్ ఆర్ ఆర్ పేటలో ధనలక్ష్మి ఎన్నికల ప్రచారం చేశారు ఈ ప్రచారంలో మహిళలు ఎక్కువ సేపు సంఖ్యలో పాల్గొనగా పలు ప్రాంతాల్లో ధనలక్ష్మి కి హారతులు పట్టారు .కరీముల్లా టీ సెంటర్ నుంచి ఓల్డ్ మసీదు సెంటర్, అల్లు అప్పల నాయుడు నగర్, కళావతి కొట్టు రోడ్, అమరావతి నగర్ ప్రాంతాల్లో ప్రచారం సాగింది. 56వ డివిజన్ కూటమి పార్టీల నేతలు ఈశ్వర్, ధనికుల సుబ్బారావు, పెద్ది శ్యాం సుందర్, యూనిట్ ఇన్ చార్జీలు, డివిజన్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.








