ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడలో ఉన్న కృష్ణవేణి క్లాత్ మార్కెట్ అభివృద్ధికి సహకరిస్తానని వ్యాపారస్తులకు ఎల్లవేళలా తన సహాయ సహకారాలు ఉంటాయని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణవేణి క్లాత్ మార్కెట్ ను సుజనా చౌదరి మంగళవారం సందర్శించారు. మార్కెట్ వ్యవస్థాపకులు బచ్చు వెంకట నరసింహారావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుజనాకు కృష్ణవేణి క్లాత్ మార్కెట్ సంఘం అధ్యక్షుడు బచ్చు ప్రసాద్ స్వాగతం పలికారు. మార్కెట్ లో వ్యాపారస్తులతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణవేణి క్లాత్ మార్కెట్ అభివృద్ధికి, సమస్యల పరిష్కారం కోసం వ్యాపారస్తులకు 24 గంటలు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మార్కెట్ లోని వ్యాపారస్తులు, కుటుంబ సభ్యులు, ముఠా కార్మికులు ఎన్డీఏ కూటమి ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా దశాబ్ద కాలం పాటు సేవలందించిన సుజనా చౌదరికి మద్దతిచ్చి అండగా నిలబడతామని అసోసియేషన్ ప్రెసిడెంట్ బచ్చు ప్రసాద్ చెప్పారు. సుజనాకు మద్దతుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ 54వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు నాళం ఠాకూర్, డివిజన్ ఇన్ చార్జ్ మిల్టన్ జైన్ , తమ్మిన శ్రీనివాస్ , పీయూష్ దేశాయ్ పాల్గొన్నారు.
వ్యాపారుల సమస్యలను తెలుసుకుంటూ
కృష్ణవేణి క్లాత్ మార్కెట్ లో ప్రచారం చేస్తున్న సుజనా చౌదరి