మిల్క్ ప్రాజెక్ట్ సమీపంలోని అభయ వీరాంజనేయ స్వామి వారిని బుధవారం పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. మిల్క్ ప్రాజెక్ట్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్ బాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమద్దీక్షా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ తో కలిసి సుజనా చౌదరి పూజలు చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ అభయ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం సంతోషకరమని ప్రజలందరూ స్వామి వారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. అభయ వీరాంజనేయ స్వామి ఆలయం గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామనీ సుజనా చౌదరి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్. అడ్డూరి శ్రీనివాసరావు పొట్నూరి గణేష్ ఆర్గనైజర్ రాంపిళ్ళ ఓంకార్ , హానుమద్దీక్షా సేవాసమితి సభ్యులు హనుమాన్ దీక్షా స్వాములు పాల్గోన్నారు.
స్వామి వారి చిత్రపటాన్ని అందించిన దుర్గాప్రసాద్ స్వామీజీ