జగన్ అరాచకపాలనపై ప్రజలందరూ విసుగుచెందారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి పదికాలాలపాటు ఉంటుందన్నారు. బుధవారం భవానీపురం బీజేపీ కార్యాలయంలో రెడ్డిపల్లి రాజు ఆధ్వర్యంలో 500 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరుతున్న యువతకు పార్టీ తరఫున మంచి భవిష్యత్తు ఉంటుందని సుజనా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ సీనియర్ నాయకులు చెన్నుపాటి శ్రీను, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. శ్రీధర్, ఓబీసీ మోర్చా కోశాధికారి బీవీకే పట్నాయక్, నియోజకవర్గం ఇన్ చార్జ్ కె.గణేష్ తదితరులు పాల్గొన్నారు.