విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని ముఖ్యంగా ఆసుపత్రి అవసరాన్ని బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) సోదరి ధనలక్ష్మి ప్రస్తావించారు.ఎన్నికల ప్రచారం లో 42వ డివిజన్ లో సుజనా సోదరి ధనలక్ష్మి ప్రచారం చేశారు. ఆసుపత్రి సౌకర్యం లేక అల్లాడుతున్నా మని స్థానికులు వాపోయారు. పశ్చిమ నియోజక వర్గం లో ఆసుపత్రి ఆవశ్యకతను సుజనా చౌదరి గుర్తించారని, ఆయన గెలవగానే పశ్చిమలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు..ఈ ప్రచారంలో డివిజన్ అధ్యక్షుడు శివాజీ, మాజీ అధ్యక్షరాలు యేదుపాటి వెంకట రమణి, తిరుపతి అనూష, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ యేదుపాటి వెంకట రామయ్య,, తిరుపతి సురేష్, సతీష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు