సుజనా ను గెలిపించండి రాజధానిని రక్షించండి అమరావతి రైతులు పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)ను గెలిపించాలని, తద్వారా రాజధానిని రక్షించే అవకాశం ఏర్పడుతుందని అమరావతి రైతులు అభిప్రాయ పడ్డారు. అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ జే ఏసీ నాయకులు భారీ సంఖ్యలో భవానీ పురం బీజేపీ కార్యాలయంకు చేరుకుని సుజనా కు సంఘీభావంగా మద్దతు తెలిపారు.
జే ఏ సి నాయకురాలు కామినేని గోవిందమ్మ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు, రైతులను మోసం చేసిందని, ఆ ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇవ్వరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతుల ఉద్యమానికి సుజనా ఎంతగానో సహకరించారని, ఆయన అందించిన సహకారాన్ని మరువ లేమని ఆమె అన్నారు. జన సేన నాయకురాలు రజని మాట్లాడుతూ అమరావతి రైతుల ఉద్యమం విజయవంతం కావడానికి సుజనా చౌదరి పాత్ర కీలకమని అన్నారు రైతు నాయకులు కొమ్మినేని వరలక్ష్మి,కోలు దుర్గ, స్వరాజ్య రావు, అనుమొలు గణేష్, కొమ్మినేని సత్యనారాయణ,, కట్టా రాజేంద్ర, జమ్ముల శాంతి కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.