ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్రచారంలో సుజనా ఐదేళ్ళ అరాచక పాలన పోవాలని మంచీ సుపరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. ప్రజలు కోరుకుంటున్న ఆదర్శ పాలన కావాలి అంటె బీజేపీ అభ్యర్థినీ ఆయిన తనను బలపరచాలని సుజనా కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం 46 డివిజన్ టిడిపి అధ్యక్షులు డి ప్రభుదాస్ టిడిపి మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ లతో కలిసి మార్కుపేట లంబాడి పేట సాయిరాం సెంటర్ కేటీ రోడ్లలో సుజనా ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఈ ప్రాంతాల్లో జరిగిన ప్రచారంలో ప్రజలు సుజాబాకు బ్రహ్మరథం పట్టారు. టిడిపి. బీజేపీ, జన సేన శ్రేణులు ఈ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నాయి.




