ఏపీలో వైసీపీ ఖేల్ ఖతమ్ అని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. భవానీపురం పార్టీ కార్యాలయంలో సుజనా సమక్షంలో పెద్ద ఎత్తున ముస్లింలు బీజేపీలో చేరారు. కులమతాలకు అతీతంగా అందరూ ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారని, వైసీపీ క్లోజ్ అని సుజనా వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో లేనివారు కూడా బీజేపీలో చేరడం విశేషమని సుజనా అన్నారు. 54, 56 డివిజన్ల నుంచి గుడిశె బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ సీనియర్ నాయకుడు పైలా సోమినాయుడు, జనసేన అధికార ప్రతినిధి కన్నా రజని తదితరులు పాల్గొన్నారు.