వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా చిట్టి నగర్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని బుధవారం సుజనా చౌదరి దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. సుజనాకు విశ్వహిందూ పరిషత్ నాయకులు కొంపెళ్ళ శ్రీనివాస్ రావు స్వాగతం పలికారు. శ్రవణా నక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని సుజనా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు బోయపాటి నాని చౌదరి, జిల్లా బీజేపీ కోశాధికారి అవ్వారు బుల్లబ్బాయి, వేరుకొండ ఉమా తదితరులు పాల్గొన్నారు.