ఆటో డ్రైవర్ గా సుజనా ప్రచారంలో భాగంగా ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు భవానీపురంలో ఓ ఆటో డ్రైవర్ తో ముచ్చటించారు సమస్యలను తెలుసుకున్నారు. ఆటో డ్రైవ్ చేసి భరోసాగా ఉంటానని అభయ మిచ్చారు. భవానిపురం లో ఆదివారం గద్దె రామ్మోహన్ రావు పార్క్ ను సందర్శించారు. ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అసోసియేషన్ నిర్వాహకులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ సమస్యలను ఓపిగ్గా విన్నారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు పొట్నూరి రాము సెక్రెటరీ కృష్ణారెడ్డి శివ మిత్ర బృందం పాల్గొన్నారు.
శివాలయం సెంటర్లోని భవాని టవర్స్ ను సందర్శించారు. అపార్ట్మెంట్ వాసులతో ముచ్చటించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పున్నమిఘాట్ వద్ద గల లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్ వాసులను కలుసుకున్నారు. లోటస్ లెజెండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెనుమాటి జనార్ధన్ సెక్రెటరీ అమర శ్రీనివాస్ సుజనాకు ఘన స్వాగతం పలికారు. అపార్ట్మెంట్ వాసుల సమస్యలను సుజనా విన్నారు. సలహాలు సూచనలను స్వీకరించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో అన్ని రంగాలను జగన్ ధ్వంసం చేశారని సుజనా దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతిచ్చి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సుజనా విజ్ఞప్తి చేశారు.