కొండంత అండగా ఉంటా-సుజనా కొండప్రాంత వాసుల కష్టాలు తీరుస్తానని, వారికి అండగా ఉంటానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి భరోసా ఇచ్చారు.. ప్రచారంలో భాగంగా 46 వ డివిజన్ లో సోమవారం భిమన వారి పేట కొండ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని మౌలిక సదుపాయాలను కల్పించాలని సుజనాను స్థానికులు కోరారు.
రేషన్ కార్డులు కూడా లేవని వాపోయారు. ఇంతకుముందు ఎవరూ వెళ్ళని విధంగా కొండపై ప్రతి ఇంటికీ సుజనా వెళ్ళారు. అందరి సమస్యలను ఓపికగా విన్నారు. వారి కష్టాలను తెలుసుకున్నారు.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, తమను జగన్ విస్మరించారని కొండప్రాంత వాసులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని, ప్రతి సమస్యనూ పరిష్కరిస్తానని సుజనా హామీ ఇచ్చారు.. కొండ ప్రాంతాల్లో ఏ నాయకుడూ తిరగనంతగా సుజనా ఇంటింటికీ వెళ్తున్నారు.
చివరికి జాతీయ మీడియా కూడా సుజనా పర్యటనకు భారీగా ప్రాధాన్యం ఇచ్చింది.ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ టీడీపీ డివిజన్ అధ్యక్షుడు డీటీ ప్రభుదాస్, టీడీపీ మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ బేవర శ్రీనివాస్ , జనసేన డివిజన్ అధ్యక్షుడు బాదర్ల శివ, జనసేన డివిజన్ ఉపాధ్యక్షుడు వడ్డాది రాజేష్, బీజేపీ నాయకులు కొరగంజి భాస్కర్, దుర్గాప్రసాద్, 47వ డివిజన్ జనసేన అధ్యక్షుడు గౌరీ శంకర్, యానాది సంఘం నాయకుడు పునూరి గంగాధర్, ఎమ్మార్పీఎస్ నాయకుడు పల్లె పోగు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.