నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో తాను చేసి చూపిస్తానని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భవానిపురం లోని ఐరన్ యార్డ్ ను మంగళవారం సందర్శించారు. వ్యాపారస్తుల ముఠాకూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం అంటే ఏమిటో తాను చేసి చూపిస్తానని అన్నారు. ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమన్నారు. నియోజవర్గ రూపురేఖలను మారుస్తానని సమగ్రాభివృద్ధి దిశగా నడిపిస్తానని హామీ ఇచ్చారు. వైసిపి ఐదేళ్ల విధ్వంస పాలనలో అన్ని రంగాలు కుంటుపడ్డాయన్నారు. వ్యాపారులకు అండగా ఉంటానని ముఠాకూలీల సంక్షేమం కోసం పనిచేస్తానన్నారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ చాంబర్ ఫెడరేషన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కరరావు ఐరన్ యార్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వక్కలగడ్డ శ్రీకాంత్ ప్రెసిడెంట్ రమణయ్య ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి ఎం ఎస్ బెగ్ బిజెపి నాయకులు పైలా సోమినాయుడు రౌతు రమ్యప్రియ లింగాల అనిల్ కుమార్ టిడిపి యువ నాయకులు డూండీ రాకేష్ ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య బిజెపి టిడిపి జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.