ఎన్నికలకు సమయం నాలుగు రోజులే ఉన్నందున కూటమి శ్రేణులందరూ కష్టపడాలని, ఆ తర్వాత అయిదేళ్ళూ ప్రజల సంక్షేమం కోసం తాను కష్టపడతానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు దాడి అప్పారావు నాయకత్వంలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, భారీ ఎత్తున మైనారిటీలు-ముఖ్యంగా మహిళలు బీజేపీలో చేరారు.
పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బీజేపీలో చేరడం ఆనందం కలిగించిందని, ఇదే స్ఫూర్తితో మరో నాలుగు రోజులు కష్టపడి తనకు బలం చేకూరేలా పనిచేయాలని కోరారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అయిదేళ్ళూ ప్రజా సేవకుడిగా పని చేస్తానని సుజనా హామీ ఇచ్చారు. వైద్యం, విద్య తదితరాల అవసరాలు, ప్రజలకు కావాల్సిన. మౌలిక సదుపాయాలు తాను కల్పిస్తానని సుజనా తెలిపారు. పోలింగ్ ఉదయం ఆరు గంటలకే బూత్‍లకు చేరుకుని ఓటింగ్ శాతం 70 దాటేలా ఓట్లు వేయాలని కోరారు.
సీనియర్ న్యాయవాది గోగుశెట్టి వేంకటేశ్వర రావు, ఎమ్మెస్ బేగ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో దాడి అప్పారావు మాట్లాడుతూ తామందరం సుజనా గెలుపు కోసం పాటుపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో కన్నా రజనీ, కనిశెట్టి లక్ష్మణరావు, పైలా సోమినాయుడు, కామా దేవరాజ్, కనిశెట్ట్ లక్ష్మణరావు, గన్నవరపు శ్రీనివాసరావు తదితరులు తదితరులు ప్రసంగించారు.