ప్రజల శ్రేయస్సు కోసం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనాను గెలిపించాలని ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఏపీలో కళా రంగాన్ని జగన్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని దుయ్యబట్టారు. ఎన్డీఏ కూటమికి ఓటేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.