మొదటిసారిగా ఓటు వేసే యువత ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు.భవాని పురం లొని న్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం మై ఓట్ మై వెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీవీ ఫైవ్ చానెల్ నిర్వహించిన కార్య్రమంలో సినీ నటుడు శివాజీ పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి పాల్గోన్నారు. యువత తొ ముఖాముఖీ మాట్లాడారు.సలహాలు సూచనలు స్వీకరించి ఓటు విలువ గురుంచి యువతకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన ఆయుధమని అన్నారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలన్నారు. సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే రాష్ట్రం ఆదోగది పాలవుతుందన్నారు. 2019 లో యువత పొరపాటున వైసిపి కి అవకాశం ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిందన్నారు.ఐదేళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ యువతకు ఒరిగిందేమీ లేదన్నారు.
ప్రతిపక్షం లో ఉన్నప్పుడువైఎస్ జగన్ యువభేరి లొ చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కారన్నారు. చదువుకున్న యువతకి ఏపీలో అవకాశాలు లభించక పోరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీలను ఇచ్చి అమలు చేయని నాయకులను యువత ప్రశ్నించాలన్నారు. సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ ఓటును సద్వినియోగపరుచుకోకపోతే నాయకుడిని ప్రశ్నించే హక్కును కోల్పోతారన్నారు. ప్రశ్నించే తత్వం యువతలో ఉండాలన్నారు. మేనిఫెస్టో అమలు చేయని ముఖ్యమంత్రిని ప్రజా ప్రతినిధులని నిలదీయాలన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించాలన్నారు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదో ప్రశ్నించాలన్నారు.
పరిశ్రమలన్నీ పొరుగు రాష్ట్రాలకు ఎందుకు పారిపోతున్నాయో యువత అడగాలన్నారు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగంతో ఆంధ్రప్రదేశ్ ఎందుకు అల్లాడిపోతుందో ప్రశ్నించాలన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో బలమైందని ఆ ఓటుతో యువత రాష్ట్ర భవిష్యత్తును మార్చాలన్నారు. మొదటి ఓటు ఎన్డీఏ కూటమి కి వేసి అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు.
కార్యక్రమంలో బిజెపి టిడిపి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.