విజయవాడ పశ్చిమ నియోజక వర్గ రాజకీయ ముఖ చిత్రం సమూలంగా మారిపోతోంది. గత దశాబ్దాల కాలంగా సాగిన రాజకీయాన్ని ఇప్పటి యువత తనకు ఇష్టంగా మలచుకుంటోంది. ఓటు విలువ అంటె ఏమిటో యువత అర్థం చేసుకుంటోంది ఒకప్పటి నాయకుల ధోరణిని నేటి యువత అంగీకరించడం లేదు. ఇపుడు వెస్ట్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ లో ఉన్న యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) యువత నాడిని పట్టుకున్నారు.
యువకులు, యువతులతో, విద్యార్థులతో సుజనా పలు దఫాలుగా సమావేశమయ్యారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు సుజనా ఆన్న రీతిలో యువత నిశ్చయించుకుంది. ఒక విధంగా చెప్పాలంటేవెస్ట్ నియోజకవర్గం వైసిపికి కంచుకోటగానే భావిస్తారు. ఎస్సీ ఎస్టీ ముస్లిం, నగరాల సామాజిక వర్గం అధికంగా ఉన్న పశ్చిమ నియోజక వర్గం లో అందరి మన్ననలు పొందడం సామాన్యమైన విషయం కాదు.
ఈ వర్గాల ప్రజలతో సుజనా అనేకమార్లు సమావేశమయ్యారు.తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే తాను ప్రజల కోసం ఏం చేయబోయేది సుజనా సోదాహరణంగా వివరిస్తున్నారు. అంతే కాదు సుజనా కొండలపై నివసించే ప్రజల దుర్భర జీవనాన్ని కళ్ళారా చూసి చలించి పోయారు. వారి జీవనంలో మార్పు కోసం ఆయన నడుం కట్టారు. అదే విషయాన్ని అనేక సందర్భాల్లో సుజనా మీడియా తో ప్రస్తావించారు కూడా. దీన్ని బట్టి గమనిస్తే వైసిపి కంచుకోటగా ఉన్న వెస్ట్ నియోజకవర్గాన్ని సుజనా బద్దలు గొట్టారు.
అన్ని సామాజిక వర్గాల నేతలతో ఆయన టచ్ లో ఉన్నారు. కొందరిని పేరు పేరునా పలకరిస్తున్నా రు. నియోజకవర్గ దశ దిశ మార్చే నేత వచ్చారన్న ఆనందంలో నియోజవర్గ ప్రజలు ఉన్నారు.