ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్ల సాధన బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) ద్వారానే సాధ్యమవుతుందని తామందరం నమ్ముతున్నామని, ఈ కారణంగా ఎన్నికల్లో సుజనా కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని వడ్డెర సంఘం నేతలు తెలిపారు. భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో వడ్డెర సంఘం నాయకులు వేముల సీతారాం, ఏ శ్రీనివాసరావు, కుంచం ప్రసాద్, కనకా రావు,,నాగరాజు తదితరులు సోమవారం మీడియాతో మాట్లాడారు. తమ దీర్ఘ కాలిక సమస్య అయిన వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ ను నెరవేర్చగలిగే సామర్థ్యం సుజనాకే సాధ్యమని నమ్ముతున్నందున ఎన్నికల్లో ఆయనకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. బీజేపీ జాతీయ పార్టీ అయినందున,సుజనాకు ఢిల్లీలో ఉన్న పరిచయాలు తదితర అంశాల ద్వారా అన్ని డిమాండ్ల పరిష్కారం జరుగుతుందని అభిప్రాయ పడ్డారు. గత ప్రభుత్వం నిలిపివేసిన వడ్డెర కార్పొరేషన్ నిధులు పునరుద్ధరణ చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, సబ్సిడీపై పనిముట్లు అందించాలని, ఇసుక రీచ్ లలో రిజర్వేషన్, పశ్చిమం లో కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని కోరారు.


భవానీపురం బీజేపీ కార్యాలయంలో సుజనాకు మద్దతు ప్రకటించిన వడ్డెర సంఘం నేతలు