వ్యాపారులకు 24 గంటలు అందుబాటులో ఉంటా…. క్లాత్ మార్కెట్ అభివృద్ధికి సహకరిస్తా – సుజనా చౌదరి
ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడలో ఉన్న కృష్ణవేణి క్లాత్ మార్కెట్ అభివృద్ధికి సహకరిస్తానని వ్యాపారస్తులకు ఎల్లవేళలా తన సహాయ సహకారాలు ఉంటాయని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణవేణి క్లాత్ మార్కెట్ ను సుజనా చౌదరి మంగళవారం సందర్శించారు. మార్కెట్ వ్యవస్థాపకులు బచ్చు వెంకట నరసింహారావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుజనాకు కృష్ణవేణి క్లాత్ మార్కెట్ సంఘం అధ్యక్షుడు బచ్చు ప్రసాద్ స్వాగతం పలికారు....