అన్న తోడు…
సుజనాకు ఓటేస్తే.. అన్నీ పరిష్కారమవుతాయి
భవానీపురం ప్రచారంలో సుజనా సోదరి ధనలక్ష్మి
పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)గెలుపు కోసం ఆయన సోదరి ధనలక్ష్మి భవానీ పురం 41వ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. భవానీ పురం మసీదు వీధి,ఆశ్రమం వీధి, రంగూన్ సాహెబ్ వీధి,కరకట్ట తదితర ప్రాంతాల్లో ధనలక్ష్మి ప్రచారం చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధనలక్ష్మితో ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. విద్యుత్ బిల్లులు, మంచినీరు సక్రమంగా రాకపోవడం వంటి సమస్యలను ప్రజలు ప్రస్తావించారు. తన సోదరుడు సుజనాను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అన్ని సమస్యలను సత్వరం పరిష్కారం చేస్తారని ప్రజలకు వివరించారు. ఈ ప్రచారంలో క్లస్టర్ ఇన్ చార్జ్ యేదుపాటి రామయ్య, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, జనసేన నాయకుడు తిరుపతి సురేష్, టీడీపీ నాయకులు నసీమా, సుభాని, పత్తి నాగేశ్వరరావు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.