కేదారేశ్వర పేట పండ్ల మార్కెట్ లో కనీస సదుపాయాలు లేవని స్థానికులు చెబుతున్నారు. పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) కుమారుడు కార్తీక్ 34వ డివిజన్ పరిధిలోని కేదారేశ్వర పేట, ఖుద్దుస్ నగర్, ఆరుపంపుల బావీ వీధి తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ లోని సమస్యలపై కార్తీక్ తో ప్రజలు ఏకరువు పెట్టారు. హమాలీల పరిస్థితి కూడా ఘోరమన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు తమ సమస్యల ను కార్తీక్ కు చెప్పుకున్నారు. సుజనా చౌదరిని భారీ మెజారిటీతో గెలిపించాలని తద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని కార్తీక్ తెలిపారు. క్లస్టర్ ఇన్ చార్జి కొట్టేటి హనుమంతరావు, కూటమి నాయకులు కొండా, రుద్రపాటి వెంకటేష్,ఆకుల రవి శంకర్, నాగరాజు, వీర బాబు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.