ఐదేళ్ళ పాటు అన్ని వర్గాల ప్రజల రక్తాన్ని పీల్చిన జలగన్నను చిత్తుగా ఓడించాలని రాష్ట్ర వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లెల లక్ష్మీనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడే బీజేపీని, ఏపి లో ప్రజా ప్రయోజనాలను పరిరక్షించ గలిగె సమర్ధవంతమైన నేత చంద్రబాబు నాయుడుని గెలిపించాలని మల్లెల కోరారు.
భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు కేంద్ర మంత్రిగా ఏపి అభివృద్ధి కోసం పాటుపడిన పశ్చిమ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)ను భారీ మెజార్టీ తో గెలిపించాలని ఆయన కోరారు.కేంద్రంలో ఎన్డీయే కూటమి, ఏపిలో కూటమి విజయం సాధించడం ఇప్పటికే ఖరారు అయిందని ప్రజలు ఈ మేరకు ఒక నిర్ణయానికి వచ్చేసారన్నారు.
జగన్ సీఎం కావడం కోసం తాను అర గుండు, అర మీసంతో రాష్ట్రమంతటా తిరిగిన విషయాన్ని మల్లెల గుర్తు చేశారు. జగన్ సిఎం అయ్యాక తనకు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో అన్ని రకాలుగా దోపిడీ జరిగిందని ఇసుక నుంచి మద్యం వరకు దేన్నీ వదల లేదని మల్లెల ఆరోపించారు. పంచాయతీ నిధులను సైతం పక్కదారి పట్టించి న జగన్ నీ ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని తెలిపారు.
పశ్చిమ నియోజక వర్గం లో సుజనా కు ప్రజలు బ్రహ్మ రథం పడుతూ న్నారని ఆయన గెలుపు ఎపుడో నిశ్చయం అయిందని, కూటమి ఎంపి అభ్యర్థి కేశినేని చిన్ని, సెంట్రల్, తూర్పు నియోజక వర్గ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రదాన కార్యదర్శి షేక్ నూర్ అహ్మద్, మహిళా కార్యదర్శి బేబీ సరోజినీ, నాయకులు లింగమూర్తి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.