విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి మద్దతుగా ఆయన కుమారుడు కార్తీక్ వించిపేటలో ప్రచారం చేశారు. రామాలయంలో పూజలు చేశారు. అన్నదానం చేశారు. వారికి వడ్డించారు. ఆ తర్వాత కార్తీక్ దంపతులు సహపంక్తి భోజనాలు చేశారు. దర్గాలో కార్తీక్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్తీక్ వెంట జలీల్ ఖాన్, ఇతర ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.








