సుజనా విజయాన్ని కోరుతూ సోదరి ప్రచారం
అన్న గెలుపు కోసం మండుటెండలో చెల్లెలు ధనలక్ష్మి ప్రచారం
అన్న గెలుపు కోసం చెల్లెలు మండుటెండలో ప్రచారం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) సోదరి ధనలక్ష్మి ఊర్మిళ నగర్ లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఊర్మిళనగర్ పోలేరమ్మ గుడిలో దర్శనం చేసుకుని 43వ డివిజన్ లో ప్రచారం ప్రారంభించారు. ఏకలవ్యనగర్, ప్రజాశక్తి నగర్, రెడ్డి కాలనీ, ఊర్మిళనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.. సమస్యల పరిష్కారం కోసం పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరి కమలం గుర్తుపై, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని)కి సైకిల్ గుర్తుపై ఓట్లు వేయమని అభ్యర్థించారు. ప్రచారంలో ధనలక్ష్మి వెంట 43వ డివిజన్ కూటమి నాయకులు కొండా, పగడాల కృష్ణ, కోటి, వల్లభనేని ప్రసన్న, విశ్వేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గం మహిళా అధ్యక్షులు సరిత 42,43,44,45 డివిజన్ల జనసేన అధ్యక్షులు మల్లెపు విజయలక్ష్మి, బొమ్ము గోవిందలక్ష్మి, తిరుపతి అనూష, జనసేన అధికార ప్రతినిధి రజిని, జనసేన ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ కోఆర్డినేటర్ తిరపతి సురేష్, మైనారిటీ నాయకులు సుభాని, షాహిద్, అల్లాబక్షు, కరిముల్లా, తదితరులు పాల్గొన్నారు.











