సుజనా చౌదరి అనే నేను మాట ఇస్తున్నా

May 11, 2024

పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి సుజనా చౌదరి కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగినట్టుగా పశ్చిమ నియోజకవర్గమంతా పర్యటించారు. 150 కి పైగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. కుల మత వర్గ బేధం లేకుండా అనేక ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో చివరి ప్రచార సభలో సుజనా భావోద్వేగంగా ప్రసంగించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన శనివారం భవానిపురం బిజెపి కార్యాలయం నుంచి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ కుమ్మరిపాలెం విద్యాధరపురం చిట్టినగర్ రథం సెంటర్ మీదుగా కాళేశ్వరరావు మార్కెట్ వరకు రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ మధ్యతరగతి రైతుబిడ్డగా మొదలైన ప్రస్థానం ప్రజల ఆశీస్సులతో రాజ్యసభ సభ్యునిగా కేంద్ర మంత్రిగా సుదీర్ఘ కాలం సేవలందించానన్నారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మాతృభూమి కి సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నాయన్నారు. వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టేందుకు ఏపీ ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఈ అవినీతి పాలనకు ముగింపు పలకడానికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వాలన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అవినీతి అరాచకం అక్రమాలు ప్రజల కళ్ళ ముందు కనిపిస్తోందన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుస్తానని పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. విద్యా వైద్యం మౌలిక సదుపాయాలకు సింహభాగం కేటాయించి పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానన్నారు. వైసిపి పాలకుల చేతగానితనంతో యువత గంజాయికి బానిసలుగా మారారన్నారు. యువతను సరైన దారిలో పెట్టడానికి ప్రత్యేక కార్యచరణ ఏర్పాటు చేశారన్నారు. మాటల మనిషిని కాదని చేతలతో చేసి చూపిస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా రాజధాని అమరావతి నిర్మాణం జరగాలన్న అనుకున్న లక్ష్యం చేరాలంటే ఎన్డీయే కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

పశ్చిమ నియోజకవర్గంలో చివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందేలా ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చారు. కొండ ప్రాంత ప్రజల కష్టాలను కన్నీళ్లను కళ్ళారా చూశానని వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొని కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటానని మాట ఇస్తున్నా అన్నారు. వైసిపి వామపక్ష పార్టీల సానుభూతిపరులు కూడా అభ్యర్థుల మంచి చెడులను బేరీజు వేసుకొని కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి పశ్చిమ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి పశ్చిమాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని 100% పోలింగ్ జరిగేలా చూడాలన్నారు. ఎన్డీయే కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ టిడిపి పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాద్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి బుద్ధా వెంకన్న టిడిపి అధికార ప్రతినిధి నాగుల మీరా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ బిజెపి నాయకులు పైలా సోమినాయుడు జనసేన ఆంధ్రాజోన్ కన్వీనర్ బాడిత శంకర్ టిడిపి మాజీ కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య పత్తి నాగేశ్వరరావు చిన్న సుబ్బయ్య యేదుపాటి వెంకటరమణి బిజెపి నాయకురాలు రౌతు రమ్యప్రియ జనసేన డివిజన్ ఇంచార్జ్ తిరుపతి అనూష బిజెపి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ
యలమంచిలి సత్యనారాయణ చౌదరి
(సుజనా చౌదరి)

బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి
విజయవాడ వెస్ట్ నియోజకవర్గం

మీ సమస్యను మాకు తెలియజేయడానికి ఈ బటన్ నొక్కండి.

https://sujanaforwest.com/wp-content/uploads/2024/04/sujana-chowdary-for-vijayawada-west-1-160x160.png
Sujana for Vijayawada West 2024
Contact
08645645645
Shri YS Chowdary, H No 7-590/1A, KCP Colony, Revenue Ward 13,Near Siddhartha College Back Side, Tadigadapa, Kanuru, Vijayawada - 520007