సుజనా స్పీడ్-వైసీపీ ఢమాల్ ఎన్నికల సమరం తుది అంకంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి స్పీడ్ కు వైసీపీ బెంబేలెత్తుతోంది. పశ్చిమ నియోజకవర్గంలో సుజనా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రతి రోజూ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను, కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు.