గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – సుజనా చౌదరి
భవానిపురం 41వ డివిజన్ టిడిపి కార్యాలయాన్ని సుజనా చౌదరి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశీనేని శివనాద్ కలిసి ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ పత్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ బిజెపి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని వైఎస్ జగన్ పాలనలో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. రానున్న ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని జన సైనికులు బూత్ కన్వీనర్లు వాలంటీర్లు పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ పత్తి నాగేశ్వరరావు. టిడిపి నాయకులు బబ్బూరి శ్రీనివాస్ బిజెపి టిడిపి జనసేన కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.