రంజాన్ పండగ తర్వాత చేపట్టే ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని చిట్టీనగర్ మోతి మసీద్ ఈద్గా లో సోమవారం నిర్వహించారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా పండుగలో పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. ముస్లిం మైనారిటీ సోదరులు తన మీద చూపిస్తున్న ప్రేమ ఆదరాభిమానాలు మరువలేనన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని వారి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానన్నారు రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ సోదరులందరూ మద్దతిచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి ఎమ్మెస్ బెగ్ టిడిపి మైనార్టీ సెల్ నాయకులు రజవుల్లా రషీద్ నాగూర్ తాజుద్దీన్ కోగంటి రామారావు కమిటీ సభ్యులు ముస్లిం మైనారిటీ మహిళలు పాల్గొన్నారు.
రంజాన్ పండగ తర్వాత చేపట్టే ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని చిట్టీనగర్ మోతి మసీద్ ఈద్గా లో సోమవారం నిర్వహించారు
April 30, 2024
