ఆధ్యాత్మిక పరంగా అందరం ధార్మికత ను కాపాడుకుందాం అని పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు
హిందూ ధార్మిక గురుస్వాముల ఆత్మీయ సమ్మేళనం భవానిపురం ఆహ్వానం కళ్యాణమండపంలో బుధవారం నిర్వహించారు పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ ధార్మికత అన్ని సమస్యలను సత్వరం పరిష్కారం చూపుతుందని స్పష్టం చేశారు. తాళ్ళయపాలెం సైవక్షేత్రం. శ్రీ శ్రీ శ్రీ శివ స్వామీజీ,
హనుమద్ దీక్ష పీఠం శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ , గురుస్వాములు గురుభవానిలు పీఠాధిపతులు విశ్వహిందూ పరిషత్తు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ కొంపెల్లి శ్రీనివాస్ బోయపాటి నాని చౌదరి విశ్వహిందూ పరిషత్తు ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.