జనం..జనం…ప్రభంజనం
సుజనాను ఆశీర్వదించిన పశ్చిమం
ముందే విజయమనే సంకేతంలా సాగిన ర్యాలీ
అట్టహాసంగా సుజనా నామినేషన్
సుజనా సూపర్ హిట్… ర్యాలీ బంపర్ హిట్
సుజనాతో అగ్రభాగాన చిన్ని, రాధా
ముందే విజయ సంకేతాలు అనేలా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ దాఖలు ప్రభంజనంలా సాగింది. విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గురువారం ఉదయం భవానీ పురం ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మొదట చిట్టి నగర్ కొత్త అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భారీ ర్యాలీ మొదలైంది. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు ప్రభంజనంలా రావడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మూడు పార్టీల జెండాలతో కన్నులపండువగా కనిపించింది. సుజనాకు మద్దతుగా కేశినేని శివనాథ్ చిన్ని ర్యాలీలో భాగం పంచుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ కూడా యువతను ఉత్సాహపర్చారు. నాయకులకు అభిమానులు గజమాల వేసి జయజయధ్వానాలు పలికారు. అడ్డూరి శ్రీ రాం,పైలా సోమినయుడు,నాగుల్ మీరా, బుద్ధా వెంకన్న జలీల్ ఖాన్, ఎమ్మెస్ బేగ్, చెన్నుపా టి శ్రీనివాస రావు తదితరులు పాల్గొని ర్యాలీకి మరింత ఊపునిచ్చారు. కూటమి పార్టీల జెండా రంగులతో కూడిన బెలూన్లతో, ఉత్తేజపర్చే పాటలతో సాగిన ర్యాలీలో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు కదం తొక్కారు. ర్యాలీతో రోడ్లన్నీ నిండిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.





