వ్యాపారులకు అండగా ఉంటా సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలోని వ్యాపారులందరికీ అండగా ఉండి వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. భవానిపురం ఆలివ్ ట్రీ హోటల్లో శనివారం పశ్చిమ నియోజకవర్గ వ్యాపారస్తుల సమావేశం నిర్వహించారు. టిడిపి నాయకులు డూండీ రాకేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి బిజెపి మాజీ ఎమ్మెల్యే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంబికా కృష్ణ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి టిడిపి పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సుజనా చౌదరి మాట్లాడుతూ నియోజకవర్గంలోని వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తల కు 24 గంటలు అందుబాటులో ఉండి వారి అభివృద్ధికి సహకరిస్తానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిని ఉక్కుపాదంతో అణిచివేయడం వలన వ్యాపార వాణిజ్య రంగాలన్నీ కుంటుపడ్డాయన్నారు. వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రచారంలో భాగంగా వస్త్రలత కృష్ణవేణి మార్కెట్ ఐరన్ యార్డ్ లను సందర్శించి వ్యాపారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నా అన్నారు. వైశ్యుల ఓటు బ్యాంకుతో గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాసరావు మంత్రిగా పనిచేసిన కూడా నియోజకవర్గ అభివృద్ధిని వ్యాపారుల సంక్షేమాన్ని విస్మరించారన్నారు.
కూటమి అధికారంలోకి రాగానే వైశ్యుల వ్యాపారస్తుల సంక్షేమం కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు.
అంబికా కృష్ణ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా రాజ్యసభ సభ్యునిగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన సుజాన చౌదరి లాంటి వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
వ్యాపారస్తులు ఆర్యవైశ్యులంతా ఒకటై ఎన్డీఏ కూటమి గెలిపిస్తే సుజనా నిస్వార్ధంగా ప్రజాసేవ చేస్తారని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి నిర్మాణం కోసం ఎన్డీఏ కూటమి గెలిపించుకోని మన కలల రాజధాని అమరావతిని నిర్మించుకుందాం అన్నారు. ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు