రానున్న ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపుతానని ఎన్డీఏ బిజెపి కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సోమవారం 38వ డివిజన్ టిడిపి అధ్యక్షురాలు పితాని పద్మతో కలిసి మల్లికార్జున పేట అర్జున వీధి పోస్ట్ ఆఫీస్ రోడ్డు బ్రాహ్మణ వీధులలో ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సుజనా చౌదరి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపుతానని సొంత జిల్లాకు పుట్టిన ఊరికి సేవ చేయడం దైవ నిర్ణయంగా భావిస్తున్నాను అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపి టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడ్డాయని చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రచారంలో నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వారి సమస్యలు పరిష్కరించి సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన తనకు సొంత జిల్లా పై అవగాహన ఉందని ప్రజలు ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా మారుస్తానన్నారు.గత వైసిపి పాలకులు నియోజవర్గ అభివృద్ధిని విస్మరించారని ప్రచారంలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే ఓటు ద్వారానే సాధ్యమని ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఓటు వేసి కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
నాగుల్ మీరా మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా రాజ్యసభ సభ్యునిగా దశాబ్ద కాలం పాటు సేవలందించిన సుజనా చౌదరి దుర్గమ్మ ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారని వారిని గెలిపించుకొని సేవలు వినియోగించుకోవాలని కోరారు. సుజనా కు మద్దతుగా కాండ్రేగుల రవీంద్ర ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పైలా సోమినాయుడు అమ్మిశెట్టి వాసు చందన సురేష్ బిజెపి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
38వ డివిజన్లో ప్రసంగిస్తున్న సుజనా చౌదరి
సమస్యలను తెలుసుకుంటూ ప్రచారంలో బుద్ధ వెంకన్న సుజనా చౌదరి