పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) తరఫున తనయుడు కార్తీక్ చిట్టి నగర్ లో ప్రచారం చేశారు. 46వ డివిజన్ లో కలరా ఆసుపత్రి నుంచి మసీదు వీధి, మార్కు పేట, లంబాడీ పేట, కొండ ప్రాంతాల మీదుగా సాయిరాం సెంటర్ వరకు సాగిన ప్రచారం సాగింది. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, కలుషిత మంచినీరు, డ్రైనేజీ సమస్యలను కార్తీక్ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కమ్యూనిటీ హాలు సదుపాయం కల్పించాలని కోరారు. తన తండ్రి సుజనాను గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని కార్తీక్ హామీ ఇచ్చారు. మాజీ కార్పొరేటర్ గుర్రం కొండ, డివిజన్ అధ్యక్షుడు పోతినీడి లోకేష్, డి ప్రభుదాస్, జన సేన నాయకుడు శివ, బీజేపీ నాయకులు, యువకులు, ఈ ప్రచారంలో భారీగా పాల్గొన్నారు