పశ్చిమ లో అపూర్వ ఆదరణ బిజెపి అభ్యర్థి సుజనా ముమ్మర ప్రచారం మీ సేవకుడిగా అవకాశం కల్పించండి అన్ని వర్గాల సమస్యలు పరిష్కరిస్తా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ మీలో ఒకడి గా మీ ముందుకు వస్తున్నా పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ మాట ఇస్తున్నా. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించండి అంటూ శుక్రవారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం 54వ డివిజన్ టిడిపి అధ్యక్షులు సయ్యద్ సలీం జనసేన డివిజన్ అధ్యక్షులు కంది నాని లతో కలిసి అమ్మ హోటల్ బిఆర్పీ రోడ్ కృష్ణవేణి మార్కెట్ పంజా సెంటర్ గాంధీ బొమ్మ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ జే ఏసీ నాయకులు అమరావతి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదిస్తే సేవకుడిగా మీలో ఒకడిగా ఉంటానని పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. పశ్చిమ లో అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయని మంత్రిగా పనిచేసిన వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి కి ఏమాత్రం సహకరించలేదన్నారు.
అవినీతికి కెరాఫ్ అడ్రస్ గా మారినఎమ్మెల్యేని ప్రజలు ఓడిస్తారని తెలిసి వేరే నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిని అటకెక్కించి మూడుముక్కలాటలాడారని దుయ్య బట్టారు.
రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తామని నియోజవర్గంలోని ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి సహకరిస్తామని తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం విషయంలో కట్టుబడి ఉందని త్వరలో ప్రధాని మోడీ పశ్చిమ నియోజకవర్గానికి వస్తారన్నారు. పంజా సెంటర్ లోని చిరు వ్యాపారస్తుల ఉపాధి కల్పన కోసం గెలిచిన మూడు నెలల్లో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం క్రిస్టియన్ మైనార్టీ ల అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రశక్తి లేదని అన్నారు. ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ చెత్త మీద పన్ను విధించిన చెత్త ముఖ్యమంత్రిని ఏపీ నుంచి తరిమి కొట్టాలన్నారు.
మాజీ టిడిపి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ మైనార్టీల సంక్షేమం హజ్ హౌస్ ల నిర్మాణం జరగాలంటే సేవాభావం కలిగిన సుజనా చౌదరి లాంటి వాళ్ళని గెలిపించుకోవాలన్నారు.సుజనా కు మద్దతుగా అమరావతి జేఏసీ నాయకులు జి స్వరాజ్యరావు కొమ్మినేని సత్యనారాయణ కొండిపాటి బుజ్జి ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి ఎమ్మెస్ బేగ్ బిజెపి నాయకులు మిల్టన్ జైన్ ఎలకళ్ళ బాబు పీయూష్ దేశాయ్ సుజనాకు మద్దతుగా నిలిచారు.