వైసిపి హామీలు నమ్మొద్దు సుజనా చౌదరి నరేంద్ర మోడీ చంద్రబాబు పాలనలోనే ఏపీలో ఎంతో అభివృద్ధి జరిగిందని జగన్ పాలనలో దేశంలో ఎక్కడా లేనంత అవినీతి జరిగిందని సుజనా చౌదరి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 34 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు అట్లూరి కొండ జనసేన అధ్యక్షులు ఆకుల రవిశంకర్ తో కలిసి కేదారేశ్వరపేట మసీద్ సెంటర్ ఖుద్దుస్ నగర్ లోటస్ ఫ్రూట్ మార్కెట్ సి కె రెడ్డి రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
సుజనా చౌదరి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ బీసీలు ఎస్సీలు మైనారిటీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ వారి సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఐదేళ్ల పాలనలో పశ్చిమ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఇసుక మట్టిని కూడా దోచుకు తిన్నారన్నారు. మరొక్క ఛాన్స్ అంటూ వస్తున్న వైసిపి మోసపూరిత హామీలను వాగ్దానాలను నమ్మి ప్రజలు ఏమాత్రం ప్రలోభాలకు లోనవ్వొద్దని సూచించారు.

ప్రజలు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సుజనా కు మద్దతుగా బిజెపి ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ జనసేన ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ బిజెపి నాయకులు పైలా సోమినాయుడు బిజెపి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.