క్రైస్తవుల సమస్యలను పరిష్కరిస్తా-సుజనా చౌదరి
నియోజవర్గంలోని క్రైస్తవులకు అండగా నిలబడి వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ప్రచారంలో భాగంగా బెదేస్తా ఫుల్ గాస్పో మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగిన ఆదరణ కూడికకు సుజనా చౌదరితోపాటు ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ హాజరయ్యారు. పాస్టర్ అప్పికట్ల జవహర్ క్రీస్తు సందేశాన్ని బోధించారు. సుజనా చౌదరి, కేశినేని శివనాద్ విజయాన్ని కాంక్షిస్తూ పాస్టర్ కాటూరి మోజెస్ ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. తాము అధికారంలోకి రాగానే క్రైస్తవుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, వారి పట్ల ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉందని సుజనా చౌదరి చెప్పారు. నియోజకవర్గ క్రైస్తవులందరూ తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మైనారిటీ కార్పొరేషన్ విభజించి క్రిస్టియన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కేశినేని శివనాద్ చిన్ని చెప్పారు. చర్చిల నిర్మాణానికి సహకరించి పాస్టర్లు గౌరవ వేతనం పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అట్టడుగు వర్గాల వారికి అభివృద్ధి సంక్షేమం అందించేలా కృషి చేస్తామని, ఎంపీగా తనను ఎమ్మెల్యేగా సుజనా చౌదరిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.