ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శివాలయం సెంటర్ నుంచి 42 వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ముదిరాజు శివాజీ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య, వెంకటరమణి జనసేన డివిజన్ అధ్యక్షులు తిరుపతి సురేష్-అనూష దంపతులతో కలిసి సుజనా ప్రచారం చేశారు. డివిజన్ లోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తానేం చేయబోతున్నానో వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు.
జగన్ లాంటి నియంతతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని అమరావతిని అణగదొక్కి రాజధాని లేని రాష్ట్రంగా చేశారని దుయ్యబట్టారు. ఏపీలో అభివృద్ధి కావాలో అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి వివరించారు. ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని, కూటమితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. సాధ్యా సాధ్యాలు పరిశీలించి ప్రయత్న లోపం లేకుండా నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
విద్యా వైద్యం మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలందరూ భారీ మెజారిటీతో కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 43 వ డివిజన్ పరిధిలో టీడీపీ అధ్యక్షులు కొనికి కొండయ్య ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకులు పైలా సోమి నాయుడు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోటెత్తిన భవానిపురం-కిక్కిరిసిన రహదారులు
ఆదివారం భవానీపురం 42. 43 డివిజన్లలో పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భవానీపురం లలితా నగర్, టెలిఫోన్స్ కాలనీ, రైతుబజార్, ఊర్మిళా నగర్ నుంచి పెద్ద ఎత్తున మహిళలు, బీజేపీ-టీడీపీ-జనసేన నాయకులు, అభిమానులు తరలివచ్చారు. ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి.



