సుజనా చౌదరితోనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు అన్నారు. సుజనా చౌదరికి మద్దతుగా ఓటేయాలంటూ పశ్చిమ నియోజకవర్గం ఓటర్లకు రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఏపీ కోసం సుజనా ఎన్నో పనులు సాధించి పెట్టారన్నారు.. సుజనాను తప్పనిసరిగా గెలిపించాలని కోరారు.