వడ్డెర్లకు అండగా ఉంటా ఆశీర్వదించండి సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలోని వడ్డెరలందరికి అండగా ఉంటానని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సుజనా చౌదరి అన్నారు. ఓం శ్రీ కనకదుర్గ వడ్డెర సేవా సంఘం అధ్యక్షులు అలకొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆంజనేయ వాగు సెంటర్లో బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ కష్టించి పనిచేసే వడ్డెరులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
వైసిపి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు వడ్డెరలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారనీ వారి అభివృద్ధికి ఏమాత్రం సహకరించకపోగా అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారారు అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావును ఓడిస్తారని తెలిసి వేరే నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేశారని దుయ్యబట్టారు. వడ్డెరల సమస్యలను పరిష్కారం చేసి వారికి అండగా నిలబడతానన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ బిజెపి నాయకులు పైలా సోమినాయుడు వడ్డెర సంఘం సెక్రెటరీ కుంభం ప్రసాద్ ఒరుసు నాగరాజు బిజెపి నాయకులు పోతిన బేసు కంటేశ్వరుడు బిజెపి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.